ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా
15 మంది కొత్త నటులతో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu). యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన రిలీజ్ ఈవెంట్కు వరుణ్ తేజ్ (Varun Tej), సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej), అడివి శేష్ (Adivi Sesh) ముఖ్య అతిథులుగా హాజరై, సందడి చేశారు.