Loading...

డల్లాస్‌ (అమెరికా) లో తొలి ఇండియన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ - గేమ్ ఛేంజర్ తో చరిత్ర సృష్టి!

డల్లాస్ నగరంలో తొలిసారి ఇండియన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గేమ్ ఛేంజర్ తో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అశేష అభిమానుల హర్షధ్వానాల మధ్య జరగడం, ప్రత్యేకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రంతో మొదలవ్వడం, తెలుగు ప్రేక్షకులను అపారమైన ఆనందానికి గురిచేసింది.

ఈ ఈవెంట్‌ను రాజేష్ కళ్ళేపల్లి గారు కరిష్మా డ్రీమ్స్ సంస్థ ద్వారా అద్భుతంగా నిర్వహించారు. దాదాపు 10,000 మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా కొంతమంది టిక్కెట్లు లేక బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా డోప్ సాంగ్‌ను ఈ వేడుకలో విడుదల చేయడంతో అభిమానులలో ఉత్సాహం మరింత పెరిగింది.

ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, S.J. సూర్యతో పాటు ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్, బుచ్చి బాబు, శంకర్, నిర్మాత దిల్ రాజు, శిరీష్, ఇతర ప్రముఖులు హాజరై వేడుకకు మరింత వైభవాన్ని తెచ్చారు. యాంకర్ సుమ మరియు సమీరా అదిరిపోయే పంచ్ లతో ఆధ్యంతం ప్రేక్షకుల మధ్య ఉత్సుకత నింపారు. 

సుకుమార్ గారు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాను చిరంజీవి గారితో కలిసి చూశాను. మొదటి భాగం చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ ఓ బాస్టర్ హిట్ అని, ద్వితీయార్థం గూస్ బంప్స్ కలిగించేదిగా ఉందని చెప్పారు. ఈ సినిమా జాతీయ అవార్డును ఖచ్చితంగా సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు.

డల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించిన "గేమ్ ఛేంజర్" ప్రీ-రిలీజ్ ఈవెంట్ తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, "తెలుగు సినిమాకు నా తొలి ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేస్తాం" అని తెలిపారు.

రామ్ చరణ్ హీరోగా, కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకుల కోసం రూపొందించబడింది.

సినిమా కథ ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య జరిగిన ఘర్షణ చుట్టూ తిరుగుతుంది.

ఎస్‌.జె. సూర్య, అంజలి, శ్రీకాంత్, బ్రహ్మానందం, సునీల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో మెరిసి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తమన్ సంగీతం, సాబూ సిరిల్ ఆర్ట్ సెట్స్, తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు.

శంకర్ గారి మాటల్లో:  తెలుగు ప్రేక్షకుల ప్రేమ అద్భుతం. రామ్ చరణ్‌తో పని చేయడం నా కెరీర్‌లో గొప్ప అనుభవం.

దిల్ రాజు మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎస్‌.జె. సూర్య మాట్లాడుతూ, నా పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పారు.

అంజలి ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇది నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అని అభిప్రాయపడ్డారు.

తమన్ మాట్లాడుతూ, ప్రతి పాట ప్రేక్షకులను కొత్త అనుభవం వైపు తీసుకెళ్తుంది  అని తెలిపారు.

ఈవెంట్‌లో రామ్ చరణ్ తన భావోద్వేగాన్ని పంచుకుంటూ, గేమ్ ఛేంజర్ నా జీవితంలో గొప్ప ప్రయాణం అని అన్నారు.

సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ థియేటర్లకు ఆహ్వానిస్తోంది. శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంచనా.

తెలుగు సినిమా చరిత్రలో గేమ్ ఛేంజర్ ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలపై అందరి నమ్మకం. చిత్రబృందం ఉత్సాహంతో ప్రచారాన్ని వేగవంతం చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

డల్లాస్ ఈవెంట్ గేమ్ ఛేంజర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. 

టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఇంత గ్రాండ్‌గా భారీ ఈవెంట్‌ను నిర్వహించినందుకు రాజేష్ కళ్ళేపల్లి మరియు కరిష్మా డ్రమ్స్‌ను నిర్మాత దిల్ రాజు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు.