Loading...

మీడియా రంగంలో కూడా భారీ పెట్టుబడుల ఆవశ్యకతను వివరించిన డెల్టా టుడే చీఫ్ ఎడిటర్ బాలినేడి హరిబాబు

ఆత్మీయ సంస్థ (USA) ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో  డెల్టా టుడే చీఫ్ ఎడిటర్,  ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలినేడి హరిబాబు పాల్గొని ప్రసంగించడం జరిగింది. 

అంతర్జాతీయ స్థాయి వ్యాపార దిగ్గజం, అనేక సాఫ్ట్వేర్ సంస్థల వ్యవస్థాపకులు, దేశ విదేశాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ఎన్ ఆర్ ఐ  ఓం ప్రకాష్ నక్కా ను  మర్యాద పూర్వకంగా కలిసి డెల్టా టుడే ప్రత్యేక సంచికను అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా బాలినేడి హరిబాబు మాట్లాడుతూ...  వర్తమాన కాలంలో మీడియా సంస్థల ప్రాధాన్యతను... పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సమాచార రంగంలో నెలకొన్న పరిస్థితులను, మీడియా సంస్థల నిర్వహణలో వాస్తవికతను వివరించడం జరిగింది. 

మీడియా సంస్థలు సైద్ధాంతిక విలువలను, నైతికతను కొనసాగించాల్సిన ఆవశ్యకతను, ప్రత్యేకంగా డెల్టా టుడే 7 సంవత్సరాల ప్రయాణంలో సాధించిన ప్రగతిని వివరించడం జరిగింది.  

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్పూర్తిని, సరైన ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం గురించి వివరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆత్మీయ సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు.