Loading...

అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా జడ్జిగా జయ బాడిగ

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఏపీలోని విజయవాడకు చెందిన జయ హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం US వెళ్లిన జయ, బోస్టన్ యూనివర్సిటీలో ఎంఏ, శాంటా క్లారా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 2009లో కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఈమె మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యుడు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె.