Loading...

రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పోలీస్‌ కేసు నమోదైంది.   ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు   విచారణకు ఈనెల 19న మద్దిపాడు పిఎస్‌లో హాజరుకావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన నివాసం వద్ద ఉన్నారు. నోటీసులు తీసుకుంటారా..? విచారణకు హాజరు అవుతారా లేదా అన్నదీ ఆసక్తికరంగా మారింది.